See Moves Back 500 Meters In Antarvedi | అర కిలోమీటరు వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం
కోనసీమ అంతర్వేది వద్ద సముద్రం అర కిలోమీటరు వెనక్కి వెళ్లింది, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
విధాత: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద వింత సంఘటన చోటుచేసుకుంది. అంతర్వేది వద్ద బంగాళాఖాతం దాదాపు 500 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో తీర ప్రాంతమంతా మోకాళ్లలోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. దీంతో సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే సముద్ద మట్టం వెనక్కి వెళుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోను ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల వెనక్కి వెళ్లినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు ఒండ్రు మట్టితో దాదాపు అర కిలో మీటరు మేర సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురైతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram