పంచాయతీ కార్యాలయంలో దూరిన ఎలుగుబంటి..జనం పరుగులు

శ్రీకాకుళం నారాయణపురంలో పంచాయతీ కార్యాలయంలో ఎలుగుబంటి దూరి, గ్రామస్తులు పరుగులు, ఒకరు స్వల్ప గాయాల తర్వాత ఆసుపత్రికి.

పంచాయతీ కార్యాలయంలో దూరిన ఎలుగుబంటి..జనం పరుగులు

విధాత, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా మందసలోని నారాయణపురం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి పంచాయతీ(సచివాలయం) కార్యాలయంలోకి దూరింది. అటు నుంచి గ్రామంలోకి సంచరిస్తూ కనిపించిన వారిపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు ఎలుగు బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఎలుగు ఒకరిపై దాడి చేయడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. యువకులు గట్టిగా కేకలు వేయడంతో వెలుగు గ్రామం నుంచి దూరంగా వెళ్లింది. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎలుగు సంచారంపై గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎలుగును బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.