లేపాక్షికి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు
విధాత: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన చేనేత,జౌళి శాఖపై సమీక్షా సమావేశం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగింది.ఈకార్యక్రమానికి ఆప్కో ఛైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ(ఏపీహెచ్డీసీఎల్) ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్ ల ఫోటోలు, అత్తుత్తమానికి గల కారణాలపై తర్వాతి సమావేశానికి సమగ్ర వివరాలందించాలని ఆదేశించిన మంత్రి మేకపాటి,పవర్ లూమ్ యూనిట్లకు అందించే పవర్ […]

విధాత: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన చేనేత,జౌళి శాఖపై సమీక్షా సమావేశం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగింది.ఈకార్యక్రమానికి ఆప్కో ఛైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ(ఏపీహెచ్డీసీఎల్) ఛైర్మన్ బండిగింజల విజయలక్ష్మి, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్ ల ఫోటోలు, అత్తుత్తమానికి గల కారణాలపై తర్వాతి సమావేశానికి సమగ్ర వివరాలందించాలని ఆదేశించిన మంత్రి మేకపాటి,పవర్ లూమ్ యూనిట్లకు అందించే పవర్ టారిఫ్ వివరాలు, ముద్ర లోన్ ల గురించి ఆరాతీశారు.ఆన్ లైన్ మార్కెటింగ్ ని పెంచి, అమ్మకాలను మరింత పెంచాలి,ఈ -కామర్స్ ద్వారా వచ్చే ఆర్డర్లను 3 రోజులలోగా డెలివరీ చేసే స్థాయికి చేరాలి.ఖాధీ ప్రోగ్రామ్, ప్రధాన మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్(పీఎమ్ఈజీపీ), ఎంటర్ ప్యూనర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఈడీపీ) లపై చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 షోరూంలు (ఏపీయేతరవి అందులో 3).కోవిడ్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినా స్వయంగా నడపగలిగినవే అన్నీ. తోలు బొమ్మలు, ఆదివాసి పెయింటింగ్స్, ఏటికొప్పాక, కొండపల్లి , బంజారా ఎంబ్రయిడరీ వస్తువల తయారీలో మరింత శిక్షణనందిస్తే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి.ఎక్కువ నాణ్యత, రకరకాల డిజైన్ల తయారీ వల్ల ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా ఉండాలి,ఒక జిల్లా ఒక వస్తువు విషయంలో మరింత చొరవ పెరగాలి.తిరుపతి బాలాజీ, పుట్టపర్తి సాయిబాబ వంటి దేవుని విగ్రహాల తయారీలో నైపుణ్యం పెంచి..ఎక్కువ ప్రతిమల తయారీపై శ్రద్ధ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా బ్రాండింగ్, బ్రాండ్ అంబాసిడర్ ఉండాలన్నారు.