ఏపీలో సెమీ కండక్టర్ల యూనిట్..కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర క్యాబినెట్ సమావేశం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది

విధాత : కేంద్ర క్యాబినెట్ సమావేశం మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రూ.4594 కోట్లతో ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తాజాగా ఆమోదం తెలిపిన సెమీ కండక్టర్ ప్రాజెక్టులు కలిపితే వీటి సంఖ్య పదికి చేరుకుంటాయి. 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి దోహదం చేయనున్నాయి. ఆరు రాష్ట్రాల్లో రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులు వీటి ద్వారా రానున్నాయి. ఇవాళ ఆమోదం తెలిపిన సెమీ కండక్టర్ ప్రాజెక్టుల ద్వారా 2,034 స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభిస్తోంది. మరో వైపు ఈ ప్రాజెక్టులపై పరోక్షంగా వందలాది మందికి జాబ్స్ వస్తాయని కేంద్ర మంత్రి చెప్పారు. అడ్వాన్స్ డ్ సిస్టం ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ఎఎస్ఐపీ ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ లో 700 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. లఖ్‌నవూ మెట్రో ఫేజ్ 1 బీకి కూడా క్యాబినెట్ అంగీకరించింది. క్లీన్ ఎనర్జీ కోసం టాటో-2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా ఉత్పత్తి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కోసం రూ. 18,500 కోట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.