ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ జర్నలిజం తరగతులు ప్రారంభం
విధాత: జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రెస్ అకాడమి తనకు తానుగా తొలి సారిగా జర్నలిజంలో 3 నెలల పాటు సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ జర్నలిజం కోర్సును ప్రారంభించింది. ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ప్రెస్ అకాడమి ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుండి 300 లకు పైగా జర్నలిస్టులు మరియు ఈ రంగంపై ఆసక్తి కలిగిన […]

విధాత: జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రెస్ అకాడమి తనకు తానుగా తొలి సారిగా జర్నలిజంలో 3 నెలల పాటు సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ జర్నలిజం కోర్సును ప్రారంభించింది. ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ప్రెస్ అకాడమి ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుండి 300 లకు పైగా జర్నలిస్టులు మరియు ఈ రంగంపై ఆసక్తి కలిగిన విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు.
జర్నలిజంలో వస్తున్న మార్పులు సాంకేతికత అందుబాటులోకి రావటంతో జర్నలిజంలో చోటు చేసుకుంటున్న అనేక అంశాలపై నిపుణులైన అధ్యాపకులు రాసిన పాఠ్యాంశాలతో పాటు నిష్ణాతులైన జర్నలిస్టులు నిర్వహించే తరగతుల వల్ల గరిష్ఠంగా లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన అంశాలతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, ప్రెస్ అకాడమి కలసి ఈ కోర్సును రూపకల్పన చేసి తరగతులను నిర్వహిస్తున్నామని ప్రెస్ అకాడమి ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలను పెంచే మరిన్ని అంశాలతో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కోర్సు శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశంలో జర్నలిస్టులకు కోర్సు రూపకల్పన చేసిన ఉద్ధేశ్యం, ఆయా అంశాల ప్రాధాన్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ , ఎల్ విజయకృష్ణ రెడ్డి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, జర్నలిజం ఫ్రొఫెసర్ పి.విజయలక్ష్మీ లు పాల్గొన్నారు.