ఎంపీ రఘురామకృష్ణను మరోసారి విచారించనున్న సీఐడీ అధికారులు

విధాత‌(అమరావతి): సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణను ఇవాళ మరోసారి విచారించ‌నున్నారు.ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, సామాజికవర్గాల మధ్య విద్వేషాల‌ను రెచ్చగొట్టారని ఎంపీ రఘురామకృష్ణపై సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా రఘురామ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయ‌న అరెస్టుపై శుక్రవారం హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం రఘురామను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచవద్దని రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ […]

  • Publish Date - May 15, 2021 / 06:55 AM IST

విధాత‌(అమరావతి): సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణను ఇవాళ మరోసారి విచారించ‌నున్నారు.
ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, సామాజికవర్గాల మధ్య విద్వేషాల‌ను రెచ్చగొట్టారని ఎంపీ రఘురామకృష్ణపై సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా రఘురామ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయ‌న అరెస్టుపై శుక్రవారం హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం రఘురామను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచవద్దని రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచవద్దని ఆదేశించింది. పోలీసుల కస్టడీలో ఉన్న ఎంపికి తగిన సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. ఆహారం, వైద్యం, వసతికి వెసులుబాటు కల్పించాలని పేర్కొంది.

అర్ధ‌రాత్రి వరకు సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ నేతృత్వంలోని అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన‌ట్లు తెలుస్తోంది. ఎంపీ చేస్తున్న వ్యాఖ్యల సమాచారం, సాంకేతిక సహకారం ఎవరిస్తున్నారని ఆరా తీశారు. ఎంపీకి ఎవరన్నా సహకరిస్తున్నారా అనే కోణంలో అధికారులు ప్రశ్నలు గుప్పించారు. రాత్రి సీఐడీ కార్యాలయంలోనే వైద్యుల బృందంతో ఎంపీకి పరీక్షలు నిర్వహించారు.