హైదరాబాద్‌కు మించి అమరావతి అభివృద్ధి : సీఎం చంద్రబాబు

మొదట్లో వ్యారవేత్తలతో రాజకీయ నాయకులు మాట్లాడేవారు కాదని, దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లొద్దని చెప్పేవారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కానీ, తాను చాలాసార్లు దావోస్ కు వెళ్లి పారిశ్రామిక వేత్తలను కలిసి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ మెంట్ పెట్టేందుకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు మించి అమరావతి అభివృద్ధి : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ తరహాలో ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) జాతీయ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సాంకేతిక మన జీవితంలో భాగంగా మారుతున్నదని, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో అనేక సేవలు మనకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అప్పటి ప్రధాన మంత్రి పీవీ గ్లోబలైజషన్ కు అనుమతి ఇవ్వడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్నదని సీఎం చంద్రబాబు నాయకుడు తెలిపారు. “వికసిత భారత్” పీఎం నరేంద్ర మోదీ లక్ష్యం అని చెప్పారు.

మొదట్లో వ్యారవేత్తలతో రాజకీయ నాయకులు మాట్లాడేవారు కాదని, దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లొద్దని చెప్పేవారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కానీ, తాను చాలాసార్లు దావోస్ కు వెళ్లి పారిశ్రామిక వేత్తలను కలిసి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ మెంట్ పెట్టేందుకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) తో ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చని చెప్పారు. రాత్రిపూట పోలీసులు డ్రోన్స్ సాయంతో పెట్రోలింగ్ నిర్వహించే విధంగా అభివృద్ధి జరిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. “స్వర్ణాంధ్ర విజన్-2025” మన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పోటీ ఆర్థిక వ్యవస్థలో మనం ముందుకు దూసుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు మందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సర కాలంలో 25 క్యాబినెట్ మీటింగ్ లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుత కాలంలో టెక్కాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నామని, ఇప్పుడు క్వాంట్ కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పారు. 100 సంవత్సరాలుగా ఉన్న ఫిక్కీ(భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ) అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అదే విధంగా స్వర్ణాంధ్రను సాకారం చేసేందుకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఫక్కీ ప్రతినిధులు హామినిచ్చారు.