జగన్‌కు ఓటేస్తేనే పథకాల కొనసాగింపు: సీఎం జగన్
మరో నాలుగు రోజుల్లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రం మహాసంగ్రామం రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును, అభివృద్ధి పథకాల కొనసాగింపు నిర్ణయించే ఎన్నికలని ఆలోచించి వైసీపీకి ఓటు వేయాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్ కోరారు.
చంద్రబాబుకు ఓటేస్తే ముగింపు
కల్యాణ దుర్గం వైసీపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్
విధాత : మరో నాలుగు రోజుల్లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రం మహాసంగ్రామం రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును, అభివృద్ధి పథకాల కొనసాగింపు నిర్ణయించే ఎన్నికలని ఆలోచించి వైసీపీకి ఓటు వేయాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్.జగన్ కోరారు. కల్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌కు ఓటేస్తే మీ గడప గడపకు అందించిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు పడుతుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేసిన ఢిల్లీ పెద్దలకు ఓటుతో బుద్ధి చెప్పాలని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని కోరారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలతో మ్యానిఫెస్టో ఇవ్వడం చంద్రబాబు నైజమని, 2014ఎన్నికల టీడీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని సంగతిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాల మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మాఫీ చేయలేదని గుర్తు చేశారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్న చంద్రబాబు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పి చేయలేదని, ఏపీని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆయన పేరు చెబితే గుర్తుండేలా ఒక్క పథకం అమలు చేయలేదని విమర్శించారు. మీ బిడ్డ జగన్ పాలనలో 59 నెలల్లో గతంలో ఎన్నడు జరగని విధంగా మార్పులు తీసుకొచ్చామని, మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలనలు 99 శాతం నెరవేర్చామన్నారు.
ఈ ఐదేళ్లలో 2లక్షల 35వేల ఉద్యోగాలు ఇచ్చామని, నాడు నేడుతో ప్రభుత్వ బడుల దశదిశను మార్చామని చెప్పారు. విద్యార్థులకు ట్యాబ్‌లు అందించి, విద్యార్థి దీవెన వంటి పథకాలు అమలు చేశామన్నారు. మహిళలకు అసరా సున్నా వడ్డీ రుణాలు, చేయూత కార్పొరేషన్ పథకాలు అందించామని, రైతన్నకు పెట్టుబడి సాయం, పగటిపుటినే 9 గంటల విద్యుత్తు ఇచ్చామని తెలిపారు. స్వయం ఉపాధి పథకాలు, వృత్తిదారులకు పథకాలు అందించామని చెప్పారు. బీ బిడ్డ జగన్ పాలనలో జరిగిన మంచిన, వచ్చి మార్పును గమనించి మరోసారి ఆశీర్వదించి వైసీపీని గెలిపించాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram