లా అండ్ ఆర్డర్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
విధాత: ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం… తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష. ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్: రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సమీక్షించిన సీఎం,ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు.దిశయాప్‌ద్వారా 5238 మందికి సహాయం,దిశయాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684.నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ […]

విధాత: ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం… తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.
ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్:
రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సమీక్షించిన సీఎం,ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు.దిశయాప్‌ద్వారా 5238 మందికి సహాయం,దిశయాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684.నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేశామన్న పోలీసులు
వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్న పోలీసులు,దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ వచ్చిందన్న పోలీసు అధికారులు.
మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు,‘దిశ’ అమలు కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.
జీరో ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేస్తున్నామని ఫోరెన్సిక్ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందని గతంలో డీఎన్‌ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు
సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంవైయస్.జగన్ ఏమన్నారంటే… ‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి,అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్ డౌన్లోడ్ కావాలి వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి,‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి ‘దిశ’యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.