పింఛన్ల నిలిపివేతపై ఆందోళన

విధాత‌(పొందూరు): పంచాయతీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేయలేదనే నెపంతోనే తమకు పింఛన్లను నిలిపివేశారని క‌డ‌ప జిల్లా, పొందూరు మండలం, పిల్లలవలస గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచి జి.పోలినాయుడు, ఉప సర్పంచి కృష్ణ, తెదేపా నాయకుడు పోలినాయుడు ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వ‌లంటీర్‌ నిర్వాకంతో మొత్తం 18 మందికి పింఛన్లు అందలేదన్నారు. విషయాన్ని సచివాలయ సిబ్బంది […]

  • Publish Date - May 5, 2021 / 07:07 AM IST

విధాత‌(పొందూరు): పంచాయతీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేయలేదనే నెపంతోనే తమకు పింఛన్లను నిలిపివేశారని క‌డ‌ప జిల్లా, పొందూరు మండలం, పిల్లలవలస గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచి జి.పోలినాయుడు, ఉప సర్పంచి కృష్ణ, తెదేపా నాయకుడు పోలినాయుడు ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వ‌లంటీర్‌ నిర్వాకంతో మొత్తం 18 మందికి పింఛన్లు అందలేదన్నారు. విషయాన్ని సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో మురళీకృష్ణ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Latest News