ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తే ఆందోళనలు… ఎస్ఎఫ్ఐ

విధాత‌: ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు ఆరోపించారు. కృష్ణాజిల్లా, ప‌డమటలంక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో బుధ‌వారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సోమేశ్వరరావు మాట్లాడారు. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి ఇచ్చిన లేదా ఎయిడెడ్ స్థానాల్లో ఉన్నా పాఠశాలలు, కళాశాలలును తొలగించి ప్రైవేటు పరం చేయండి అని చెప్పటం సరికాదని అన్నారు. ఎప్పటినుంచో ఎయిడెడ్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో విద్యార్థులకు చదువు […]

  • Publish Date - May 5, 2021 / 07:24 AM IST

విధాత‌: ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు ఆరోపించారు. కృష్ణాజిల్లా, ప‌డమటలంక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో బుధ‌వారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సోమేశ్వరరావు మాట్లాడారు.

నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి ఇచ్చిన లేదా ఎయిడెడ్ స్థానాల్లో ఉన్నా పాఠశాలలు, కళాశాలలును తొలగించి ప్రైవేటు పరం చేయండి అని చెప్పటం సరికాదని అన్నారు. ఎప్పటినుంచో ఎయిడెడ్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో విద్యార్థులకు చదువు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిద్యాసంస్థలు నిర్వీర్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు.

యూనివర్సిటీ పరిధిలో జరగబోయే డిగ్రీ, ఇంజనీరింగ్, సెమిస్టర్ పరీక్షలు తక్షణమే వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన షెడ్యూల్ వెంటనే రద్దు చేసి పరీక్షలు కొన్ని రోజులు పాటు వాయిదా వేయాలని అధికారులను డిమాండ్ చేశారు.రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రాణాలకు నష్టం జరిగే అవకాశం ఉంద‌ని, యూనివర్సిటీ అధికారులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.

గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన జగనన్న వసతిదీవెన పదివేల రూపాయలు విద్యార్థులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రాష్ట్రప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని ప్రస్తావించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.

తక్షణమే గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన జగనన్న వసతి దీవెన బకాయిలు ఇవ్వాలని కోరారు. మరియు వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకకిట్లు పాఠశాలలు ప్రారంభం కాకమునుపే విద్యార్థులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పూర్ణచంద్రిక, ఎస్ఎఫ్ఐ విజయవాడ నగర నాయకులు ఎం.కార్తీక్ పాల్గొన్నారు.

Latest News