పారిశ్రామిక అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విధాత: పారిశ్రామిక అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలాజానాథ్ డిమాండ్ చేసారు. కొత్తగా పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో..నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో పారిశ్రామిక వసతులను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని, ముఖ్యంగా […]

విధాత: పారిశ్రామిక అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలాజానాథ్ డిమాండ్ చేసారు. కొత్తగా పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో..నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో పారిశ్రామిక వసతులను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని, ముఖ్యంగా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీ, విశాఖలోని నాయుడుపేట క్లస్టర్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని, 2020–21లో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు రూ.2,705 కోట్లు కేటాయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.968.34 కోట్లను పెంచి రూ.3,673.34 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను పరిశ్రమల శాఖకు కేటాయించారన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీకి రూ.200 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీకి రూ.200 కోట్లు కేటాయింపులు చేసిందని, ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.60.93 కోట్లను కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్కు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రూ.250 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,000 కోట్లు , రొయ్యల ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు రాయితీల నిమిత్తం రూ.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి 195 దేశాలకు 2,106 రకాల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2019–20లో సుమారు రూ.1,08,348 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 2020–21లో 13.8 శాతం వృద్ధి రేటుతో రూ.1,23,370 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రస్తుతం దేశం ఎగుమతుల్లో 6 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం 2030 నాటికి 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచాలని నిర్దేశించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి ఈ రుణం తీసుకొచ్చింది. ఇందులో రూ.1,000 కోట్లను 7.04 శాతం వడ్డీకి 13 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. మిగతా రూ.1,000 కోట్లను 7.09 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. ఈ నెలలో ఇంకా రూ.3,000 కోట్లు అప్పు తీసుకుంటామని రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సమాచారం ఇచ్చింది. కేంద్రం సెప్టెంబరు 3వ తేదీన అనుమతిచ్చిన కొత్త అప్పులు రూ.10,500 కోట్లలో రూ.7,000 కోట్లు తెచ్చేసింది. ఇంకో రూ.3,500 కోట్లు మాత్రమే మిగిలి ఉందని, అక్టోబరులోనే తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని చెప్పారు.