కరోనా వేళ ఏపీలో అతి పెద్ద డ్రగ్ స్కామ్!
కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా విజృంభించి ప్రజల ప్రాణాలను హరిస్తూ … కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. మరోవైపు వైద్య బృందం తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తోంది. అయితే అక్రమ సంపాదనకు, అవినీతికి అలవాటు పడ్డ పెద్దలు కొందరు ఈ మృత్యు విహారంలోనూ కాసుల వేటకు తెగబడ్డారు. అతి పెద్ద డ్రగ్ స్కామ్ కు తెరదీశారు. కరోనా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఘోరాతిఘోరమైన ఈ స్కామ్ ఏంటో చూడండి. రెమ్‌డెసివిర్… […]

కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా విజృంభించి ప్రజల ప్రాణాలను హరిస్తూ … కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. మరోవైపు వైద్య బృందం తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తోంది. అయితే అక్రమ సంపాదనకు, అవినీతికి అలవాటు పడ్డ పెద్దలు కొందరు ఈ మృత్యు విహారంలోనూ కాసుల వేటకు తెగబడ్డారు. అతి పెద్ద డ్రగ్ స్కామ్ కు తెరదీశారు. కరోనా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఘోరాతిఘోరమైన ఈ స్కామ్ ఏంటో చూడండి.
రెమ్‌డెసివిర్… కరోనా చికిత్సలో కీలకంగా భావించే రెమ్‌డెసివిర్ కోసం ఒకానొక దశలో దేశం యావత్తూ కొట్టుమిట్టాడిందన్న విషయం మనందరికీ తెలుసు. ఆ దశలో రెమ్‌డెసివిర్ ను ఏడెనిమిది రెట్ల ధరకు బ్లాక్ లో అమ్మారని కూడా విన్నాం. సరిగ్గా ఈ డిమాండ్ నే ఆసరాగా తీసుకుని డ్రగ్ రాకెట్ నడిపించారని తెలుస్తోంది.
ముందుగా ఈ రెమ్‌డెసివిర్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సాధారణంగా ఒక టాబ్లెట్ లేదా కాప్సూల్ ని మనం నోటి గుండా తీసుకున్నప్పుడు… మన శరీరంలోని కాలేయం ఆ మందును ముందుగా వడకట్టి… ఏ శరీర భాగంలో దాని అవసరం ఉందో అక్కడికి రక్తం ద్వారా పంపిస్తుంది. అయితే ఈ వడకట్టడం వల్ల 40 నుంచి 60 శాతం మందు ప్రభావాన్ని మాత్రమే మనం అందుకోగల్గుతాం. అందుకని రూపొందించిందే ఇంజెక్షన్ల పద్దతి . ఇంజక్షన్ల ద్వారా ద్రవరూప మందు నేరుగా రక్తంలో కలుస్తుంది కాబట్టి మందు ప్రభావం 100 శాతం ఉంటుంది. అందుకే రెమ్‌డెసివిర్ ను కూడా ఇంజక్షన్ల కోసం ద్రవ రూపంలో తయారు చేసారు. కరోనా చికిత్సలో ఒక్కో పేషెంట్‌కు ఐదు నుంచి ఆరు డోసుల రెమ్‌డెసివిర్ అవసరమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ మందును మైలాన్, హెటెరో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇక స్కామ్ విషయానికి వస్తే.. ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషంట్లకు ఇచ్చిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇది. భారత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 104ఏ కింద.. ఏ డ్రగ్ కు సంబంధించిన కంటైనర్ మీద అయినా తయారీ సంస్థ అంటించిన లేబుల్ తప్ప దానిపై మరో లేబుల్ ను అంటించకూడదు. కానీ ఇక్కడ చూస్తే ఈ ఇంజక్షన్ బాటిల్ పై మందు తయారు చేసిన మైలాన్ సంస్థ లేబుల్ పై మరో లేబుల్ అంటించి ఉంది. ఈ రెండో లేబుల్ ను నెమ్మదిగా తీసి చూస్తే… ఎక్సపైరీ డేట్ ను మార్చడానికి ఈ కొత్త లేబుల్ ను అంటించారని తెలుస్తోంది.
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ను ఎప్పుడు ఏ పేషంటుకు ఇచ్చారో, ఎన్నో డోస్ ఇచ్చారో వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ ఇది. అయితే వీరిలో ఎంతమందికి ఎక్సపైరీ డేట్ అయిపోయిన రెమ్‌డెసివిర్ ఇచ్చి ఉంటారన్నది ప్రశ్న. కొంతమందికే ఇలా ఇచ్చారా, లేక అందరికీ ఇలా ఎక్సపైరీ డేట్ అయిపోయిన రెమ్‌డెసివిర్ ఇచ్చారా అన్నది దర్యాప్తు చేస్తేనే కానీ తెలియదు.
ఎక్సపైరీ డేట్ అయిపోయిన రెమ్‌డెసివిర్ ఇస్తే ఏమవుతుంది?
ఎక్సపైరీ డేట్ లేదా షెల్ఫ్ లైఫ్ అయిపోయిన ఏ మందునైనా స్ఫురియస్ డ్రగ్ లేదా adulterated డ్రగ్ లేదా ఫేక్ డ్రగ్ అంటాం. ఇలాంటి మిస్ బ్రాండెడ్ లేదా నకిలీ మందులను వాడటం తీవ్రమైన, శిక్షార్హమైన నేరం. అసలు ఈ నకిలీ మందును వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటి?
ఒకటి… కరోనా పేషంటుకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నాం అంటేనే ఆ పేషంటు ఆక్సిజన్ బెడ్ పై ఉన్నట్టు లెక్క. పేషంటు శరీరంలో చెలరేగే సైటో కైన్స్ స్టార్మ్ ను ఆపేందుకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నాం. అలాంటి కీలక సమయంలో ఈ నకిలీ రెమ్‌డెసివిర్ ఇవ్వడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. మరోవైపు చికిత్స జరుగుతుందని డాక్టర్లు పేషంటు అనుకుంటారు. కానీ వాస్తవానికి నకిలీ మందువల్ల చికిత్స జరగనట్టే లెక్క. దీనివల్ల పేషంటు పరిస్థితి మరింత క్షీణించవచ్చు.
రెండోది… adverse డ్రగ్ రియాక్షన్స్ (ADR). ఎక్సపైరీ డేట్ అయిపోయిన తర్వాత వాడే ఏ మందు అయినా కలిగించే దుష్ప్రభావాలను ADR అంటాం. అలాంటి దుష్ప్రభావాల వలన కరోనా పేషంటు తీవ్రమైన విషమ పరిస్థితికి లోనై ప్రాణాలు పోగొట్టుకోవచ్చు.
ఇక్కడ చూడండి… నర్సీపట్నం ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ చికిత్సను అందుకున్న పేషంట్లలో… చిటికెల తాతమ్మ నాయుడు, ఎ. సన్యాసిరావు, ఎస్.అరుణ్ చంద్ అనే ఈ ముగ్గురు మరణించారు. వీరిలో చిటికెల తాతమ్మ నాయుడు ఈనాడు మీడియా రిపోర్టర్ కావడం విశేషం. ఇదిగో వీరు ముగ్గురు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ తీసుకున్నారనడానికి ఆసుపత్రి రిజిస్టర్ లో నమోదైన సాక్ష్యాలు.