ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం

విజయవాడ: కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగం […]

  • Publish Date - May 11, 2021 / 11:41 AM IST

విజయవాడ: కోవిడ్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ-పాస్ ఉన్న వారికే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోముంది. వాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచనుంది. ప్రతీ సెంటర్ వద్ద రెండు వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ రెండో డోస్ వేయనున్నారు.

Latest News