విజయవాడలో దసరా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం
విధాత: కలెక్టర్ నివాస్ అధ్యక్షతన వీఎంసీ కౌన్సిల్ హాలులో దసరా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం గురువారం ప్రారంభమైంది. దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారుల నుంచి మంత్రి వెలంపల్లి, కలెక్టర్ నివాస్ వివరాలు సేకరిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. […]

విధాత: కలెక్టర్ నివాస్ అధ్యక్షతన వీఎంసీ కౌన్సిల్ హాలులో దసరా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం గురువారం ప్రారంభమైంది. దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారుల నుంచి మంత్రి వెలంపల్లి, కలెక్టర్ నివాస్ వివరాలు సేకరిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఉండనుంది. అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్ స్లాట్ తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉండనుంది. ఈ క్రమంలో కొండ కింద ఆన్‌లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు. 7 న శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. 7న ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది. దసరాలో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, సిపి బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జెసి మాధవి లత, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు పాల్గొన్నారు.