హైకోర్టు చెప్పినా విన‌రా ?.. సిపిఐ

విధాత‌: మెరుగైన చికిత్స కోసం ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చే వాహ‌నాలు, అంబులెన్సుల‌ను తెలంగాణ స‌రిహ‌ద్దులో ఆ రాష్ట్ర పోలీసులు ఆపాడం స‌రికాద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు అంబులెన్సుల‌ను ఆప‌డం వ‌ల్ల కరోనా రోగులు చ‌నిపోతున్నార‌ని, ఇందుకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు. క‌ర్నూల్ జిల్లా, నంధ్యాల‌, కడపలకు చెందిన ఇద్దరు కరోనా రోగులు తెలంగాణ పోలీసుల తీరు వ‌ల్ల మరణించార‌ని […]

  • Publish Date - May 14, 2021 / 09:36 AM IST

విధాత‌: మెరుగైన చికిత్స కోసం ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చే వాహ‌నాలు, అంబులెన్సుల‌ను తెలంగాణ స‌రిహ‌ద్దులో ఆ రాష్ట్ర పోలీసులు ఆపాడం స‌రికాద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు అంబులెన్సుల‌ను ఆప‌డం వ‌ల్ల కరోనా రోగులు చ‌నిపోతున్నార‌ని, ఇందుకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు.

క‌ర్నూల్ జిల్లా, నంధ్యాల‌, కడపలకు చెందిన ఇద్దరు కరోనా రోగులు తెలంగాణ పోలీసుల తీరు వ‌ల్ల మరణించార‌ని తెలిపారు. తెలంగాణ హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు మానవత్వం చూప‌డం లేద‌న్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణ‌మ‌న్నారు.