Duvvada Srinivas | చంపుతారా రండి..ఇక్కడే ఉన్నా : అర్ధరాత్రి హైవేపై దువ్వాడ హల్చల్

నన్ను చంపే దమ్ముందా అంటూ అర్ధరాత్రి హైవేపై దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల నుంచి ప్రాణహాని ఉందన్న సమాచారంతో నిమ్మాడ జంక్షన్‌లో హల్చల్ చేశారు.

Duvvada Srinivas | చంపుతారా రండి..ఇక్కడే ఉన్నా : అర్ధరాత్రి హైవేపై దువ్వాడ హల్చల్

అమరావతి : నన్ను చంపుతారా రండి..నేను ఇక్కడే వేచి చూస్తున్నానంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి నరసన్నపేట-నిమ్మడ జంక్షన్ల వద్ద హైవేపై హల్చల్ చేశారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య దివ్వెల మాధురికి కింజరాపు అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేయడంతో వివాదం రగిలింది. కింజరాపు అప్పన్న మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కావడం గమనార్హం.

నరసన్నపేట-నిమ్మడ జంక్షన్ల వద్ద దువ్వాడను కొట్టేందుకు స్కెచ్‌ వేశారన్న ఫోన్ కాల్ బెదిరింపు వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద హైవేపైకి వెళ్లి నన్ను చంపాలనుకునే వారు ఇక్కడికి రావాలంటూ సవాల్ విసురుతూ ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. నన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే రండి. నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, దేనికైనా సిద్ధం” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎదుటివారిని ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ ఘటనతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో, టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

ఇవి కూడా చదవండి :

Actor Shivaji : మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ
Hyderabad Drugs Case : మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు!