Special Trains | పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వేశాఖ..! ఎక్కడి బయలుదేరుతాయంటే..?
Special Trains | పూరీ జగన్నాథుడి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలలో జరిగే జగన్నాథ యాత్రకు పూరీకి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ నిర్ణయించింది.
Special Trains | పూరీ జగన్నాథుడి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలలో జరిగే జగన్నాథ యాత్రకు పూరీకి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ నిర్ణయించింది. ఎనిమిది ప్యాసింజర్ ట్రైన్స్‌ను నడుపనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. పలాస-పూరీ స్పెషల్ (08331) హరిపూర్‌గ్రామ్ రైలు అర్గుల్ మీదుగా పలాస నుంచి ఈ నెల 7, 15, 17న మూడురోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పలాసలో రాత్రి 12.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.35 గంటలకు పూరీ చేరుకుంటుంది. పూరీ-పలాస స్పెషల్ (08332 ) ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. పూరీలో ఉదయం 4 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 10.05 గంటలకు పలాస చేరుతుంది.
ఇక విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08347) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా విశాఖపట్నం నుంచి ఈ నెల 6, 14, 16 తేదీల్లో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనున్నది. విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి.. అదేరోజు రాత్రి 10.45గంటలకు పూరీ చేరుతుంది. పూరీ-విశాఖపట్నం ప్రత్యేక రైలు (08348) ఈ నెల 8, 16, 18 తేదీల్లో మూడురోజులు రైలునడుస్తుంది. ఈ రైలు ఆయా తేదీల్లో పూరీలో తెల్లవారుజామున 1.45 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ రైళ్లు కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మాపూర్, చత్రాపూర్, గంజాం, ఖల్లికోటే, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకార్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక గుణుపూర్-పూరీ స్పెషల్ రైలు (08345) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా ఈ నెల 6, 14, 16 తేదీల్లో నడుస్తుంది. గుణుపూర్‌లో రాత్రి 11.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు పూరీ చేరుతుంది. పూరీ-గుణుపూర్ (08346) స్పెషల్ ఈ నెల 7, 15, 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పూరీలో రాత్రి 9.20 బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గుణుపూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఏపీలోని పాతపట్నం, టెక్కలి, నౌపడ, పుండి, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగనున్నాయి. జగదల్‌పూర్-పూరీ స్పెషల్ (08349) రైలు హరిపూర్‌గ్రామ్, అర్గుల్, జగదల్‌పూర్ మీదుగా ఈ నెల 6, 14, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జగదల్‌పూర్‌లో ఉదయం 10.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.45గంటలకు పూరీకి చేరుతుంది.
తిరుగుప్రయాణంలో పూరీ-జగదల్‌పూర్ స్పెషల్ (08350) రైలు ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పూరీ నుంచి అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 03.10 గంటలకు జగదల్‌పూర్ చేరుకుంటుంది. రైళ్లు కోట్‌పర్ రోడ్, జేపూర్, కోరాపుట్, దమంజోడి, లక్ష్మీపూర్ రోడ్, టికిరి, రాయగడ, పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సొంపే, బ్రహ్మపూర్, చత్రపూర్, గంజాం, ఖల్లికోట్, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకర్‌పూర్, కైపదర్ రోడ్, అర్గుల్ స్టేషన్లలో ఆగుతాయని రైల్వేశాఖ వివరించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram