రూయాలో ఆక్సిజన్ అంద‌క 11 మంది మృతి

విధాత‌(తిరుప‌తి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అంద‌క 11 మంది క‌రోనా బాధితులు మృతి చెందారు. ట్యాంక్‌లోకి ఆక్సిజ‌న్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్ప‌డింది. ఈ కార‌ణంగా ఆక్సిజ‌న్ బెడ్ల‌కు స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు స‌మాచారం. అప్ప‌టికే జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రిగి పోయింది. అయితే కొద్ది సేప‌టికే ఆక్సిజన్ సరఫరా మొదలయ్యింద‌ని అధికారులు అంటున్నారు. క‌రోనా బాధితులు చ‌నిపోవడంతో ఆస్పత్రి వ‌ద్ద‌ ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కొంది. ఆక్సిజన్ కోసం ఐసీయూ వార్డులో పేషెంట్ల బంధువుల […]

  • Publish Date - May 11, 2021 / 05:03 AM IST

విధాత‌(తిరుప‌తి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అంద‌క 11 మంది క‌రోనా బాధితులు మృతి చెందారు. ట్యాంక్‌లోకి ఆక్సిజ‌న్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్ప‌డింది. ఈ కార‌ణంగా ఆక్సిజ‌న్ బెడ్ల‌కు స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు స‌మాచారం. అప్ప‌టికే జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రిగి పోయింది.

అయితే కొద్ది సేప‌టికే ఆక్సిజన్ సరఫరా మొదలయ్యింద‌ని అధికారులు అంటున్నారు. క‌రోనా బాధితులు చ‌నిపోవడంతో ఆస్పత్రి వ‌ద్ద‌ ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కొంది. ఆక్సిజన్ కోసం ఐసీయూ వార్డులో పేషెంట్ల బంధువుల ఆందోళనకు దిగారు. వార్డులోని వస్తువులను పగులగొట్టారు. దీంతో భయంతో నర్సులు ప‌రుగులు తీశారు. ఆగ్ర‌హించిన మృల బంధువులు డాక్టర్లు, సిబ్బంది ఉన్న గదుల తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించారు. భ‌యాందోళ‌న చెందిన వైద్య సిబ్బంది ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.

Latest News