రూ.150 కోట్లతో ‘కరకట్ట’ విస్తరణ
విధాత,అమరావతి : కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డును 15.525 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఉదయం ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.150 కోట్లతో వీటిని చేపడుతున్నట్లు జల వనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి దాటిన తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నుంచి రాయపూడి గ్రామం వరకు విస్తరిస్తారు. అమరావతి స్మార్టు అండ్ సస్టైన్‌బుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ […]
విధాత,అమరావతి : కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డును 15.525 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఉదయం ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.150 కోట్లతో వీటిని చేపడుతున్నట్లు జల వనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి దాటిన తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద నుంచి రాయపూడి గ్రామం వరకు విస్తరిస్తారు. అమరావతి స్మార్టు అండ్ సస్టైన్‌బుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇందుకు కావాల్సిన నిధులు సమకూరుస్తుంది. ఇప్పటికే 2018-19 ధరలతో టెండర్లు పిలిచారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఈ పనులు చేపడుతోంది. రోడ్డు విస్తరణలో ముఖ్యాంశాలు..కరకట్ట రోడ్డు ఎగువన దాదాపు 10 మీటర్లు ఉంటుంది. పాదచారులు నడిచేందుకు వీలుగా రెండు వైపులా 1.50 మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేయనున్నారు. మట్టి తవ్వకాలు, కరకట్ట వెడల్పు చేయడం, కట్టడాల నిర్మాణం, రోడ్డు ఏర్పాటు వంటి పనులు అన్నీ జల వనరుల శాఖ నిబంధనల ప్రకారమే చేయనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram