అధిక ఫీజుల దోపిడినీ వెంట‌నే అరిక‌ట్టాలి

విధాత‌:కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫిజులు దోపిడీ అరికట్టాలి. అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలు పై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరుతూ విజయవాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులుకు వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఓ.యేసు బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫీజులవాత విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదనీ, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఏ మాత్రం ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు […]

అధిక ఫీజుల దోపిడినీ వెంట‌నే అరిక‌ట్టాలి

విధాత‌:కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫిజులు దోపిడీ అరికట్టాలి. అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలు పై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరుతూ విజయవాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులుకు వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఓ.యేసు బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫీజులవాత విద్యార్థులకు పుస్తకాల మోత తప్పడం లేదనీ, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఏ మాత్రం ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని సంస్థలకు నోటీసులు ఇవేమీ తమకు పట్టనట్టుగా కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయిని. కొన్ని యాజమాన్యాలు అయితే గత ఏడాది కన్నా ఇప్పటికీ ఫీజులు రెట్టింపు చేశాయి.ఈ దోపిడీ ఎల్‌.కె.జి నుండే ఆరంభమవ్ఞతున్నది. ఎల్‌.కె.జి కి లక్షలాది రూపాయలు వసూలు చేసే పాఠశాలలు పుట్టు కొచ్చాయని అన్నారు. అటువంటి విద్యాసంస్థలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ఏడాది కూడా ఈ పరిస్థితి ఉండడంతో కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిర్దిష్టమైన ఆధారాలతో ఏయే యాజమాన్యాలు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో సమగ్ర వివరాలతో ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదులు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదను ఆయన అన్నారు. అధిక ఫిజులు దోపిడీ పై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలనీ లేనిపక్షంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.