కొత్తపేట అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మూగ‌జీవాలు

విధాత‌: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు […]

కొత్తపేట అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మూగ‌జీవాలు

విధాత‌: కృష్ణ జిల్లా,అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గరికిపాటి ఏసుబాబు కు చెందిన పశువుల పాక పూర్తిగా దగ్దమైనది. ఈ ప్రమాదంలో 2 గేదెలు మృత్యువాత పడగా, మరికొన్ని గేదెలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద స్థలానికి దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పశువులు ఆ మంటల్లో కాలిపోయాయి. పశువులను మేపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన గేదెలు మంటల్లో కాలిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన విఆర్వో గుడివాక శేషుబాబు, పశువైద్యాధికారులు.అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది.