రాష్ట్రంలో ఆక్వా వర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.. సీఎం జగన్

విధాత:రాష్ట్రంలో ఆక్వా వర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్​ అధికారులకు సూచించారు. ఆక్వా లాబ్స్‌ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.పశు సంవర్ధక, మత్స్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చేపల వినియోగం పెరగాలి, ధరలు అందుబాటులో ఉండాలని సీఎం జగన్​ అన్నారు. రాష్ట్రంలో చేపల వినియోగం పెంచడానికి హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని అధికారులకు […]

రాష్ట్రంలో ఆక్వా వర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.. సీఎం జగన్

విధాత:రాష్ట్రంలో ఆక్వా వర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్​ అధికారులకు సూచించారు. ఆక్వా లాబ్స్‌ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.పశు సంవర్ధక, మత్స్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చేపల వినియోగం పెరగాలి, ధరలు అందుబాటులో ఉండాలని సీఎం జగన్​ అన్నారు. రాష్ట్రంలో చేపల వినియోగం పెంచడానికి హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ఆక్వా వర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు.

ఆక్వా లాబ్స్‌ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ఆక్వా సీడ్, ఫీడ్‌ల విషయంలో కల్తీలు ఉండకూడదని సీఎం అన్నారు. కేజ్‌ ఫిష్‌ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద మూడుచోట్ల కేజ్‌ ఫిష్‌ కల్చర్ చేపట్టాలన్నారు. మూడు చోట్ల మరీకల్చర్‌లను మొదలుపెట్టాలని సూచించారు. హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం కావాలని ఆదేశించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు.