Raghuveera Reddy | వైద్య విద్యలో 107,108 జీవోలు రద్ధు చేయాలి.. ఏపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి వినతి

అర్హత కలిగిన పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే విధంగా నూతన ప్రభుత్వ వైద్య కాలేజీలలో గత ప్రభుత్వం 50% సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా క్రింద అనుమతిస్తూ తెచ్చిన జీవో నెంబర్ 107, 108 లను రద్ధు చేయాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Raghuveera Reddy | వైద్య విద్యలో 107,108 జీవోలు రద్ధు చేయాలి.. ఏపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి వినతి

విధాత, హైదరాబాద్ : అర్హత కలిగిన పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే విధంగా నూతన ప్రభుత్వ వైద్య కాలేజీలలో గత ప్రభుత్వం 50% సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా క్రింద అనుమతిస్తూ తెచ్చిన జీవో నెంబర్ 107, 108 లను రద్ధు చేయాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం ఆ జీవోలు జారీ చేసిన సమయంలో ఆనాడు ప్రతిపక్ష పార్టీలు అన్నీ వ్యతిరేకించాయని, మీరు మీ మిత్రపక్షం జనసేన నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అధికారంలోకి రాగానే ఈ రెండు జీవోలను రద్ధు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికలలో యిచ్చిన మాట మేరకు జీవోలు 107, 108లను తక్షణమే రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని పేర్కోన్నారు.