ఆంధ్రా నుంచి అమెరికా వ‌ర‌కు.. దుమ్ము దులిపేస్తున్న‌ బాల‌య్య‌

విధాత‌: ఇన్ని రోజులు ప్రేక్ష‌కులు లేకుండా వెలవెలబోయిన థియేట‌ర్లు నేడు కొత్త క‌ళను సంత‌రించుకున్నాయి. బాల‌కృష్ణ‌ న‌టించిన అఖండ సినిమా ఈ రోజు విడుద‌లవ‌డంతో థియేట‌ర్ల‌న్నీ కిటకిటలాడుతున్నాయి. వారం ముందే టికెట్లన్నీ బుక్క‌వ్వ‌గా థియేట‌ర్ల ముందు సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. బాల‌య్య అభిమానులు బాణాసంచా కాల్చారు,ఫ్లెక్సీల‌కు హార‌తులు ప‌ట్టి పండుగ చేసుకున్నారు. కటౌట్లకు క్షీరాభిషేకాలు చేశారు. థియేట‌ర్ల‌లో సినిమా చూస్తూ జై బాల‌య్య.. జై జై బాల‌య్య అంటూ నంద‌మూరి అభిమానులు ర‌చ్చ‌ ర‌చ్చ చేశారు. తెలుగు […]

ఆంధ్రా నుంచి అమెరికా వ‌ర‌కు.. దుమ్ము దులిపేస్తున్న‌ బాల‌య్య‌

విధాత‌: ఇన్ని రోజులు ప్రేక్ష‌కులు లేకుండా వెలవెలబోయిన థియేట‌ర్లు నేడు కొత్త క‌ళను సంత‌రించుకున్నాయి. బాల‌కృష్ణ‌ న‌టించిన అఖండ సినిమా ఈ రోజు విడుద‌లవ‌డంతో థియేట‌ర్ల‌న్నీ కిటకిటలాడుతున్నాయి.

వారం ముందే టికెట్లన్నీ బుక్క‌వ్వ‌గా థియేట‌ర్ల ముందు సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. బాల‌య్య అభిమానులు బాణాసంచా కాల్చారు,ఫ్లెక్సీల‌కు హార‌తులు ప‌ట్టి పండుగ చేసుకున్నారు. కటౌట్లకు క్షీరాభిషేకాలు చేశారు. థియేట‌ర్ల‌లో సినిమా చూస్తూ జై బాల‌య్య.. జై జై బాల‌య్య అంటూ నంద‌మూరి అభిమానులు ర‌చ్చ‌ ర‌చ్చ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాకుండా అమెరికాలోను బాల‌య్య అభిమానులు కార్ల‌తో ర్యాల్లీ చేస్తూ జై బాల‌య్య అంటూ నినాదాలు చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమాకి అంత‌టా పాజిటివ్ టాక్ వ‌స్తుండడంతో అభిమానులు ప‌ట్ట‌రాని సంతోషంతో ఉన్నారు. పై వీడియో చూడండి అభిమానులు ఎలా రచ్చ చేస్తున్నారో మీకే ఆర్థమవుతుంది.