సుగాలిమిట్టలో జిక్సిన్‌ పరిశ్రమ

ప్రభుత్వ సహకారంతో నిర్మాణం యువతకు ఉపాధి అవకాశం జూలై 1న జిక్సిన్‌ పరిశ్రమకు భూమి పూజ విధాత‌:చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిక్సిన్‌ పరిశ్రమ (గ్యాస్‌ సిలిండర్ల తయారీ) ఏర్పాటు కానుంది. ఇందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ తీసుకున్నారు. జులై ఒకటో తేదీ ఉదయం 7 గంటలకు భూమిపూజ చేయనున్నారు. జిక్సిన్‌ గ్రూపుల కంపెనీ రూ.57 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను […]

సుగాలిమిట్టలో జిక్సిన్‌ పరిశ్రమ
  • ప్రభుత్వ సహకారంతో నిర్మాణం
  • యువతకు ఉపాధి అవకాశం
  • జూలై 1న జిక్సిన్‌ పరిశ్రమకు భూమి పూజ

విధాత‌:చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిక్సిన్‌ పరిశ్రమ (గ్యాస్‌ సిలిండర్ల తయారీ) ఏర్పాటు కానుంది. ఇందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ తీసుకున్నారు. జులై ఒకటో తేదీ ఉదయం 7 గంటలకు భూమిపూజ చేయనున్నారు. జిక్సిన్‌ గ్రూపుల కంపెనీ రూ.57 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమను నెలకొల్పనుంది. ఏటా 7.2 లక్షల ఎల్పీజీ వంటగ్యాస్‌ సిలిండర్లు, 125 ఎండబ్ల్యూహెచ్‌ఆర్‌ లిథియం, అయాన్‌సెల్స్‌, బ్యాటరీలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వంటగ్యాస్‌ సిలిండర్లను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్లకు సరఫరా చేస్తారు. ప్రైవేటు సంస్థలైన సూపర్‌గ్యాస్‌, మల్బార్‌గ్యాస్‌, ఎంవీఆర్‌ గ్యాస్‌ బాట్లింగ్‌ ప్లాంట్లకు సరఫరా చేయనున్నారు. జిక్సిన్‌ పరిశ్రమ ద్వారా 750 మందికి, అ కంపెనీకి అనుబంధమైన లిథియాన్‌ పరిశోధన, అభివృద్ధి కంపెనీ ద్వారా మరో 150 మంది సాంకేతిక నైపుణ్యం గల యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఏపీఐఐసీ ద్వారా 27 ఎకరాల భూమిని కేటాయించారు. పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, రక్షణ, భారీ పరిశ్రమలశాఖల అనుమతులతో చేపడుతున్న నిర్మాణ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిక్సిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (విజయవాడ) ఎండీ రాహుల్‌ తెలిపారు.