బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్క‌డ‌క్క‌డా భారి వ‌ర్షాలు

అమరావతి :పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు, చాలాచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం మంగళవారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం […]

బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్క‌డ‌క్క‌డా భారి వ‌ర్షాలు

అమరావతి :పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు, చాలాచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం మంగళవారం ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. టెక్కలి ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.భవానీ నగర్, బాపారెడ్డి కాలనీ, రాందాసు పేట ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సంతబొమ్మాళి మండలం నౌపడాలో కాలువలు సరిగ్గా లేక వీధుల్లో వరదనీరు నిలిచింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.