అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గం

విధాత‌: ఏపీ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇటువంటి ఘటనలు పెను విఘాతం క‌లిగిస్తాయ‌న్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టును ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంటే సీఎం జగన్ మాత్రం కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నార‌ని మండిప‌డ్డారు. సాక్షాత్తు ఎంపీని అరెస్టు చేయించి, జగన్ తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేదిలేదనే సంకేతాలిచ్చార‌ని, […]

  • Publish Date - May 15, 2021 / 06:38 AM IST

విధాత‌: ఏపీ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇటువంటి ఘటనలు పెను విఘాతం క‌లిగిస్తాయ‌న్నారు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టును ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంటే సీఎం జగన్ మాత్రం కక్షపూరిత విధానాలు అవలంబిస్తున్నార‌ని మండిప‌డ్డారు. సాక్షాత్తు ఎంపీని అరెస్టు చేయించి, జగన్ తన పాలనను ఎవరు విమర్శించినా ఊరుకునేదిలేదనే సంకేతాలిచ్చార‌ని, ఇది స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని రామకృష్ణ పేర్కొన్నారు. ఇక‌నైనా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు, అరెస్టుల‌ను మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Latest News