Two Italian Tourists Swept Away| విశాఖలో బీచ్ లో కొట్టుకపోయిన ఇద్దరు విదేశీయులు
విశాఖ పట్టణం యారాడ బీచ్ లో అలల ధాటికి ఇద్దరు ఇటలీ పర్యాటకులు కొట్టుకపోయారు. వారిలో రెస్క్యూ టీమ్ ఒకరిని రక్షించింది.
అమరావతి : విశాఖ పట్టణం యారాడ బీచ్ లో(Visakhapatnam’s Yarada Beach) అలల ధాటికి ఇద్దరు ఇటలీ పర్యాటకులు(Two Italian Tourists) కొట్టుకపోయారు(Swept Away). ఇటలీ నుంచి 16 మంది పర్యాటకులు విశాఖలోని యారాడ బీచ్ సందర్శనకు వచ్చారు. స్నానం చేస్తుండగా వారిలో ఒకరు మృతి చెందారు. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉందని, ఈతకు అనుకూలం కాదని.. మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డు సిబ్బంది వారిని ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లారు.
అలల ఉధృతికి ఇద్దరు ఇటాలియన్లు కొట్టుకుపోగా.. పోర్టు మెరైన్ పోలీస్ అప్పారావు, జీవీఎంసీ లైఫ్ గార్డులు వెంటనే అప్రమత్తమై మునిగిపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీపీఆర్ చేసినా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో పర్యాటకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram