ర‌హ‌దారుల‌ను ప‌రిశీలంచిన జ‌న‌సైనికులు

విధాత‌: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో గోతులు పడ్డ రహదారులను నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అక్రమ స్లాబులు వేయడంపై ఉన్న శ్రద్ధ గోతులు రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో లేదని విమర్శించారు. రూ.600 కోట్లతో నగరంలో అభివృద్ధి చేపడుతున్నట్లు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పోతిన మండిపడ్డారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 […]

ర‌హ‌దారుల‌ను ప‌రిశీలంచిన జ‌న‌సైనికులు

విధాత‌: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో గోతులు పడ్డ రహదారులను నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అక్రమ స్లాబులు వేయడంపై ఉన్న శ్రద్ధ గోతులు రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో లేదని విమర్శించారు. రూ.600 కోట్లతో నగరంలో అభివృద్ధి చేపడుతున్నట్లు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పోతిన మండిపడ్డారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి రోడ్ల మరమ్మతులు చేపట్టి ఉంటే జనసైనికులు స్వచ్ఛందంగా శ్రమదానం ద్వారా గోతులు పూడ్చే పని చేపడతామని జనసేన నేతలు స్పష్టం చేశారు.