JC Prabhakar Reddy Warning to Media | మీడియాకు జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చి ఉద్రిక్తత రాయవద్దని హెచ్చరించారు.

JC Prabhakar Reddy

విధాత: టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అనంతపురం కలెక్టర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటి గురించి ప్రపంచమంతా తెలుసు కానీ మీడియా వారికి తెలియడం లేదన్నారు. ప్రతి సారి తాడిపత్రిలో ఉద్రిక్తత అని రాస్తే బాగోదని, నాముందు తమాషాలు చేయొద్దని, నాగురించి అందరికి తెలుసు ఒక్క మీడియా వారికి తప్ప అని హెచ్చరించారు. ఉద్రిక్తత అని ఎవరైనా రాస్తే వారి ఇంటి ముందుకు నేను వెళ్లి ఉద్రిక్తత చేయాల్సి వస్తుందన్నారు.

Latest News