ఏపీకి ‘జిందాల్’ ఆక్సిజన్

విధాత‌(అమరావతి): కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరే పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్ప‌డుతోంది. దీన్ని అధికమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మరోవైపు దేశంలోనే ఆక్సిజన్ తయారీలో ముందున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 24నుంచి ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రం ఆంగుల్​లోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి ప్రతిరోజూ […]

  • Publish Date - May 8, 2021 / 11:55 AM IST

విధాత‌(అమరావతి): కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరే పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్ప‌డుతోంది. దీన్ని అధికమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మరోవైపు దేశంలోనే ఆక్సిజన్ తయారీలో ముందున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

ఇందులో భాగంగా ఏప్రిల్ 24నుంచి ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రం ఆంగుల్​లోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి ప్రతిరోజూ 20 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపిన ట్యాంకర్లను పంపుతోంది. జిందాల్ యాజమాన్యం సరఫరా చేస్తున్న లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ద్వారా వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని.. క్లిష్ట సమయంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న జిందాల్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వైద్య ఆరోగ్యశాఖ కృతజ్ఞతలు తెలిపింది.

Latest News