ముగ్గురాళ్ల పేలుడు ఘటనలో కీలక వ్యక్తి అరెస్ట్‌

కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పేలుడు ఘటనలో పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ వైఎస్‌ కుటుంబానికి చెందిన ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు తేల్చారు. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా […]

  • Publish Date - May 12, 2021 / 02:54 AM IST

కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పేలుడు ఘటనలో పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ వైఎస్‌ కుటుంబానికి చెందిన ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు తేల్చారు. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ప్రతాప్‌రెడ్డి పెదనాన్న.ఆయనకు పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది. ఈ క్రమంలో పులివెందుల నుంచి మామిళ్లపల్లె గనులకుజిలెటన్‌ స్టిక్స్‌ తరలించి అక్కడ అన్‌లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు మృతిచెందారు. ఈ కేసులో ఇప్పటికే గని యజమాని నాగేశ్వర్‌రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు.

Latest News