బాలికపై అసభ్య ప్రవర్తన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్టు
కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఇటీవల ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదవ్వగా.. గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు
విధాత : కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఇటీవల ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదవ్వగా.. గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలోనే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపులకు సంబంధించి ఏపీ ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది. దీంతో సుధాకర్ తీరుపై అప్పట్లో మహిళా సంఘాలు మండిపడ్డాయి.
కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇటీవల ప్రభుత్వం మారడంతో ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. తాజాగా అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో సుధాకర్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుధాకర్ స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు సతీశ్‌కు టికెట్ కేటాయించారు. అయినప్పటికీ కోడుమూరులో వైసీపీకి ఓటమి తప్పించుకోలేకపోయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram