Kurnool : ట్రావెల్స్ బస్సు తొలగింపు చర్యల్లో ప్రమాదం..క్రేన్ బోల్తా

వేమూరి కావేరి బస్సు తొలగింపు చర్యలో క్రేన్ బోల్తా పడింది, ఆపరేటర్‌కు తీవ్ర గాయాలు, పోలీసులు అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Kurnool : ట్రావెల్స్ బస్సు తొలగింపు చర్యల్లో ప్రమాదం..క్రేన్ బోల్తా

అమరావతి : కర్నూల్ జిల్లాలో మంటల్లో దగ్ధమైన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును రోడ్డు మీద నుంచి తొలగించేందుకు చేపట్టిన చర్యల్లో అపశృతి చోటుచేసుకుంది. బస్సును తొలగిస్తున్న క్రేన్ అకస్మాత్తుగా బోల్తా పడింది. దీంతో ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దర్యాప్తు బృందాలు మృతుల గుర్తింపు కోసం ఫొరెన్సిక్, డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నాయి.

బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా… ఇద్దరు డ్రైవర్లు సహా 27మంది బయటపడ్డారు. వారిలో గాయాలకు గురైన 12మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.