రాహుల్‌తో సమావేశం ఎంతో ఉత్తేజం ఇచ్చింది: శైలజానాథ్
విధాత,ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ.. రాహుల్‌తో సమావేశం ఎంతో ఉత్తేజం ఇచ్చిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపితం చేస్తామన్నారు. ఎమోషనల్ సెంటిమెంట్‌తో తమ పార్టీ ఓటు బ్యాంకును జగన్ తీసుకెళ్లారని చెప్పారు. కాంగ్రెస్‌కి దూరమైన అన్ని వర్గాలను దగ్గరకు చేరుస్తామన్నారు. జగన్ పన్నుల రూపంలో వసూల్ చేస్తుంది ఎక్కువని, ప్రజలకు ఇచ్చేది […]
విధాత,ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ.. రాహుల్‌తో సమావేశం ఎంతో ఉత్తేజం ఇచ్చిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపితం చేస్తామన్నారు.
ఎమోషనల్ సెంటిమెంట్‌తో తమ పార్టీ ఓటు బ్యాంకును జగన్ తీసుకెళ్లారని చెప్పారు. కాంగ్రెస్‌కి దూరమైన అన్ని వర్గాలను దగ్గరకు చేరుస్తామన్నారు. జగన్ పన్నుల రూపంలో వసూల్ చేస్తుంది ఎక్కువని, ప్రజలకు ఇచ్చేది తక్కువన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్ధమవుతున్నాయన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram