పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం: మంత్రి నారాయణ
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు
విధాత : పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన లగపూడిలోని సచివాలయంలో మంత్రిగా తన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
రాజధాని అమరావతి రైతులు సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, 15 రోజుల్లో అధ్యయనం చేసి టౌమ్ బౌండ్ నిర్ణయిస్తామని చెప్పారు. రాజధాని తొలి దశ పనులకు రూ.48 వేల కోట్లు ఖర్చవుతాయని, మూడు దశల్లో రూ. లక్ష కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం, చోరీలపై చర్యలు తీసుకుంటామని, దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram