మైనార్టీ సబ్ ప్లాన్ అమలు రాజ్యాంగ విరుద్ధం
విధాత: మతం ఆధారంగా సబ్ ప్లాన్ లను అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా రాజ్యసభసభ్యులు జీవిఎల్ నరసింహారావు అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వం అమలుచేయనున్న మైనార్టీ సబ్ ప్లాన్ అమలును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం హిందూమతాన్ని అవమానించి అన్యమతలస్తులను అందలాలెక్కించడం మానుకోవాలని సూచించారు. వినాయక చవితిపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం గతేడాది పోలీస్ స్టేషన్లో రాష్ట్ర పండుగా క్రిస్మస్ పండుగను చేసుకోవడం మైనార్టీలకు సంతుష్టీకరణ కోసమే అన్నారు. ఇంకా ఆయన ఇలా […]

విధాత: మతం ఆధారంగా సబ్ ప్లాన్ లను అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా రాజ్యసభసభ్యులు జీవిఎల్ నరసింహారావు అభివర్ణించారు. వైకాపా ప్రభుత్వం అమలుచేయనున్న మైనార్టీ సబ్ ప్లాన్ అమలును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం హిందూమతాన్ని అవమానించి అన్యమతలస్తులను అందలాలెక్కించడం మానుకోవాలని సూచించారు. వినాయక చవితిపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం గతేడాది పోలీస్ స్టేషన్లో రాష్ట్ర పండుగా క్రిస్మస్ పండుగను చేసుకోవడం మైనార్టీలకు సంతుష్టీకరణ కోసమే అన్నారు. ఇంకా ఆయన ఇలా అన్నారు…
ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నిస్సిగ్గుగా అమలుచేయడాన్ని చూస్తే జాలేస్తుంది. అనేక సందర్భాల్లో మైనార్టీలను ప్రసన్నం చేసుకునే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే పార్టీ నాయకులు టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని నిర్మించి తీరుతామని ప్రగల్భాలు పలికారు. దేశ నాయకులు స్వాతంత్ర సమరయోధులు లేనటువంటి వల్లమాలిన ప్రేమ ఈ రాష్ట్రానికి సంబంధం లేని ఈ రాష్ట్రానికి చెందిన ముస్లిం ఛాందసవాది టిప్పుసుల్తాన్పై చూపించడం ముస్లిం ఓటుబ్యాంకు కోసమేనని స్పష్టంగా తెలుస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చాలా శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లేనిపోని నిబంధనలు పెట్టి వినాయకచవితి సంప్రదాయబద్ధంగా జరుపుకోనివ్వకుండా కేంద్రం నిబంధనల సాకుతో అబద్ధాలు చెప్పి వక్రీకరించి హిందువులే మోసగించింది. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం లోకి వెళ్ళిన హిందువులంతా ఈ విషయాన్ని చెప్పి ఆవేదన వ్యక్తంచేశారు. అన్యమత పండుగలు జరుపుకోడానికి ఎలాంటి నిబంధనలు పెట్టకుండా కేవలం వినాయకచవితి పండుగను జరుపుకోడానికే ఎందుకు అమలుచేశారు. రాబోయే రోజుల్లో అన్యమతాలకు చెందిన పండుగలు వస్తాయి వాటికి నిబంధనలు. ఎలా చేస్తారో లేక చేయరో హిందూ సమాజం, భాజపా చూస్తుంది. ఇది ప్రభుత్వానికి ఖకచ్చితంగా పరీక్ష సమయం. హిందువుల కే పరిమితం పరిమితులు అంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం.
గురువారం రాష్ట్ర క్యాబినెట్ లో మైనార్టీ సబ్జెన్ పెట్టారని సమాచారం. కానీ రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఖచ్చితంగా అల్పసంఖ్యాక వర్గాలకు సంతోషపెట్టడానికే వైకాపా ప్రభుత్వం పూనుకుంది. ఈ ఆలోచన వైకాపా వెంటనే ఉపసంహరించుకోవాలి. విభజించి పాలించే మత రాజకీయాల కోసం ఇలాంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు మతపరమైన రాజకీయాలు చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నం చేశాయి. వాటికి తోడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ సబ్ ను ఆలోచనతో చేసే ఓటు బ్యాంకు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లను అమలుచేయకుండా తుంగలో తొక్కుతూ ఆ వర్గాలకు అన్యాయం చేస్తూ వారి అభివృద్ధి ఫలాలు అందనివ్వకుండా మరోవైపు మైనార్టీ ఓట్లు గాలం వేయడం ప్రజావ్యతిరేకచర్య, ఈ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. హిందువుని మరోసారి అన్యాయం చేసే దిశగా అభివృద్ధి ఫలాలు కొన్ని వర్గాలకు పరిమితం చేసే ఆలోచనను భాజపా వ్యతిరేకిస్తుంది.
పదవుల పందేరానికి వేదికకాదు
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలకమండలి సభ్యుల సంఖ్యను ఎన్నడూ లేని విధంగా పెంచారు. ఛైర్మన్ తో సహా 25 మంది సభ్యులుంటే వారికి అదనంగా మరో యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఈ ప్రత్యేక ఆహ్వానితులు భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తమ అధికార రాజకీయాలకు, పదవుల పందేరాలకు వేదికగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. చట్టానికి నిబంధనలకు లోబడి పాలకమండలి సరిపోతుంది. పుణ్యక్షేత్రంగా, తిరుమల విశిష్టత గుర్తించి అలాంటి ఆలోచనలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు మానేసి, హిందువులపై ఆంక్షలు మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.
ఘంటసాల శతదినోత్సవాలు ప్రకటించాలి
అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుకు డిసెంబరు 4వ తేదీలో వందేళ్లు వస్తున్న సందర్భంగా ఆయనకు శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని జీవిఎల్ నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లాలోని యాగసందర్శనార్ధం ఘంటసాల వెంకటేశ్వరరావు స్వగ్రామం టేకుపల్లి గ్రామానికి సందర్శించగా అక్కడ ఘంటసాలగారి సొంతగృహం ఉందని చెప్పారు. ఘంటసాలకు వందేళ్లు వస్తున్నా దీనిని గురించి ప్రభుత్వంగాని సీనీరంగం, కళారంగం ఆలోచన చేయకపోవడం బాధేసిందని అన్నారు. స్థానికులకు ఎవరికి సమాచారం లేదని అందువల్ల మహోన్నతుడైన అమరగాయకుడు శతాబ్ది ఉత్సవాలను డిసెంబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంస్కృత కార్యక్రమంగా నిర్వహిస్తామని ప్రకటించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు భాషా దినోత్సవాన్ని సంవత్సరకాలం పాటు నిర్వహిస్తుట్లుగా, మహోన్నతుడైన ఘంటసాల సంగీతానికి చేసిన సేవలు గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం శతజయంతి కార్యక్రమాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేవారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు వెంటనే చొరవ తీసుకొని సరైన ప్రతిపాదనలో చేయాలని అన్నారు. తన వంతు కృషిగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి తెలుగువారైనకిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. సినిమా రంగాన్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా కూడా ఘంటసాలగారికి తగిన ప్రాధాన్యతను ఇచ్చి ప్రత్యేక కథనాలు ప్రచురించాలని కోరారు. ఈరోజు దూరదర్శన్ కేంద్రసందర్శనకు వెళ్లిన సందర్భంబలో వారిని కూడా ఘంటసాల పై ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ చేయాలని కోరినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మీడియా ఇన్ఛార్జి లక్ష్మీపతిరాజా పాల్గొన్నారు.