MLA Nandamuri Balakrishna | బస్సు నడిపిన బాలయ్య.. నాట్లేసిన సునీతమ్మ
కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉత్సాహంగా పర్యటిస్తూ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు
MLA Nandamuri Balakrishna | కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉత్సాహంగా పర్యటిస్తూ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఈ క్రమంలో హిందూపూర్ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ శ్రీ సత్య సాయి (Sri Satya Sai) జిల్లా హిందూపురం (Hindupur) ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మూడు నూతన ఆర్టిసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ (Minister Savithamma) తో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు. మరోవైపు అనంతపురం జిల్లాలో వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత సందడి చేశారు. వెంకటాపురంలోని తన వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ పనులలో భాగంగా స్వయంగా సునీత వరినాట్లు వేశారు. వరలక్ష్మీ వ్రతం రోజు నేల తల్లికి పూజలు చేసి అనంతరం కూలీలతో కలిసి ఉత్సాహాంగా వ్యవసాయ పనుల్లో పాల్గొని వరినాట్లు వేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram