ఆలయాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు…. 17 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.17 లక్షల విరాళం విధాత:చంద్రగిరి,శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు అధినేత, సినీ నటులు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థిక విరాళాన్ని అందజేశారు. గురువారం రంగంపేట సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేపడుతున్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని మోహన్ బాబుతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ […]

ఆలయాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు…. 17 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
  • శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి..
  • ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.17 లక్షల విరాళం

విధాత:చంద్రగిరి,శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు అధినేత, సినీ నటులు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్థిక విరాళాన్ని అందజేశారు. గురువారం రంగంపేట సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేపడుతున్న శ్రీ సాయిబాబా ఆలయాన్ని మోహన్ బాబుతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో మార్బల్ బండలు వేసేందుకు అవసరమైన రూ.17 లక్షల నిధులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహన్ బాబుకు అందజేశారు. ఇంకా ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మోహన్ బాబు అభినందించారు.