కరోనా వ్యాక్సిపై అపోహ‌లు, భ‌యం వ‌ద్దు..

కరోనా వ్యాక్సిపై అపోహ‌లు, భ‌యం వ‌ద్దు.. విధాత‌(అమరావతి): రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వారంద‌రికీ సెకండ్ డోస్ వేస్తామని, ఎటువంటి భయాందోళనలకు, అపోహ‌లకు గురికావొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. ఈ నెలలో కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే డోస్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే డోస్ లను నిర్ధేశించిన సమ‌యానికే సెకండ్ డోస్ కు వినియోగిస్తామని, వారికి వేయగా మిగిలితే ఫస్ట్ డోస్ […]

  • Publish Date - May 6, 2021 / 10:02 AM IST

కరోనా వ్యాక్సిపై అపోహ‌లు, భ‌యం వ‌ద్దు..

విధాత‌(అమరావతి): రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వారంద‌రికీ సెకండ్ డోస్ వేస్తామని, ఎటువంటి భయాందోళనలకు, అపోహ‌లకు గురికావొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. ఈ నెలలో కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే డోస్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే డోస్ లను నిర్ధేశించిన సమ‌యానికే సెకండ్ డోస్ కు వినియోగిస్తామని, వారికి వేయగా మిగిలితే ఫస్ట్ డోస్ గా టీకాలు వేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గడిచిన 24 గంట్లో 1,16,367 కరోనా టెస్టులు నిర్వహించగా, 22,204 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని, 85 మంది మృతిచెందారని ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ప్రభుత్వాసుపత్రులకు, ప్రైవేటు ఆసుపత్రులకు సప్లయ్ చేశామన్నారు. ఆక్సిజన్ కొరత రాబోతున్నదని నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు… సంబంధిత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే. సతీష్ ధావన్ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) సాయంతో 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను ఆయా ఆసుపత్రులకు సకాలంలో అందజేశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రెమిడెసివిర్ 15,037 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నేటి సాయంత్రం(బుధవారం) మరో 12 వేల వాయిల్స్ అందజేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 11,556 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 5,248 ఇంక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకున్నారన్నారు.

ప్రభుత్వం వద్ద అనుమతులు పొందిన 206 ఆసుపత్రులకు 6,308 డోసుల సప్లయ్ చేశామన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన కొవిడ్ నియంత్రణకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం కమిటీ సమావేశం జరిగిందన్నారు. కొవిడ్ పై గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేయనున్నారన్నారు. హెల్ప్ డస్క్ ల పనితీరుపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నామన్నారు.

Latest News