గవర్నర్ తో భేటీ అయిన ఎస్ టి కమీషన్ సభ్యుడు అనంత నాయక్
విధాత: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో జాతీయ షేడ్యూలు తెగల కమిషన్ సభ్యుడు, మాజీ పార్లమెంటేరియన్ అనంత నాయక్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న అనంత నాయక్ బృందానికి గవర్నర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. అనంతరం గౌరవ గవర్నర్ తో సమావేశం అయిన అనంత నాయక్ సమకాలీన అంశాలపై చర్చించారు. గిరిజన సమస్యల పరిష్కారంలో కమీషన్ చేపడుతున్న వివిధ […]
విధాత: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో జాతీయ షేడ్యూలు తెగల కమిషన్ సభ్యుడు, మాజీ పార్లమెంటేరియన్ అనంత నాయక్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న అనంత నాయక్ బృందానికి గవర్నర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. అనంతరం గౌరవ గవర్నర్ తో సమావేశం అయిన అనంత నాయక్ సమకాలీన అంశాలపై చర్చించారు. గిరిజన సమస్యల పరిష్కారంలో కమీషన్ చేపడుతున్న వివిధ చర్యలను గురించి అనంత నాయక్ గవర్నర్ కు వివరించారు. గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుండి ఉప సంచాలకులు కొండలరావు, ఈశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రుక్మాంగదయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram