దేవినేనిపై తొంద‌ర‌పాటు చర్యలు వద్దు.. ఏపీ హైకోర్టు

విధాత (అమరావతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ దేవినేని పిటిషన్‌ వేశారు. దేవినేని ఉమపై తొందరపాటు చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలను హైకోర్టు పొడిగించింది. ఉమపై ఇవాళ్టి వరకు (మే 7) తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను జూన్‌17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా […]

  • Publish Date - May 7, 2021 / 11:44 AM IST

విధాత (అమరావతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ దేవినేని పిటిషన్‌ వేశారు.

దేవినేని ఉమపై తొందరపాటు చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలను హైకోర్టు పొడిగించింది. ఉమపై ఇవాళ్టి వరకు (మే 7) తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను జూన్‌17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా ఉండాలంటే కొనసాగవచ్చని హైకోర్టు పేర్కొంది.