NTR Statue as Krishna Avatar | శ్రీకృష్ణావతారంలో ఎన్టీఆర్ విగ్రహం..వైరల్ గా వీడియో
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఎన్టీఆర్‌కు శ్రీకృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ విగ్రహ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

NTR Statue as Krishna Avatar | విధాత: దివంగత మాజీ ముఖ్యమంత్రి..విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కు తెలుగు ప్రజలలో ఉన్న ఆదరణ జగద్వితమే. తన పౌరాణిక, సాంఘీక, చారిత్రాక, ఫాంటసీ చిత్రాలలో తన నటనతోనే కాకుండా..ముఖ్యమంత్రిగా తన పరిపాలనతో తెలుగు ప్రజలపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా రాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషోత్తముల పాత్రలలో తన ఆహర్యం..వేషధారణ..నటనతో ఎన్టీఆర్ ఆ దేవుళ్లు తనలాగే ఉంటారేమో అన్నంతగా ప్రభావితం చేశారు.
ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో అనేక చోట్ల ఆయన విగ్రహాలు పెట్టుకోవడం చూశాం. అయితే ఆయన రాముడు, కృష్ణుడు పాత్రలతో కూడిన విగ్రహాలను నెలకొల్పడం అరుదు. ఆ మధ్యలో ఖమ్మంలో అలాంటి విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. తాజాగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో శ్రీకృష్ణావతారంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ఆకట్టుకుంటోంది. తక్కెళ్లపాడు గ్రామ టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రావులపాలెం కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు.
గ్రామంలోని చెరువు వద్ద మండపాన్ని నిర్మించి అందులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్వయంగా శ్రీకృష్ణావతారంలో వచ్చి అక్కడ కొలువుతీరినట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లోఆ విగ్రహం మరింత నయన మనోహరంగా కనిపిస్తుండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గామారాయి. ఈ విగ్రహానికి, మండప నిర్మాణాలకు రూ.14లక్షల వరకూ ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ప్రముఖులందరినీ ఆహ్వానించి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.