విధాత(మంగళగిరి): ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళగిరిలో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన 590 టన్నుల ఆక్సిజన్ కోటాను వినియోగించుకున్నామన్నారు.
ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.