విదేశీ విద్యా బకాయిల‌ను చెల్లించాలి.. షేక్ బాజి

విధాత‌: 90% ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల ఉద్దేశ్యపూర్వకంగా వివక్ష చూపుతోందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ముస్లింలకు అనేక ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలను మోసగించే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ గత ప్రభుత్వంలో విదేశీ విద్య […]

  • Publish Date - May 12, 2021 / 11:41 AM IST

విధాత‌: 90% ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల ఉద్దేశ్యపూర్వకంగా వివక్ష చూపుతోందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ముస్లింలకు అనేక ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలను మోసగించే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ గత ప్రభుత్వంలో విదేశీ విద్య అభ్యసించడానికి యస్.సి, యస్.టి, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారని, అయితే విదేశాలలో ఉన్న ముస్లిం మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించిన గత ప్రభుత్వ బకాయిలను వేయకుండా ఇతర వర్గాల వారికి వేసి విదేశాలలో ఉన్న ముస్లిం మైనార్టీ విద్యార్థుల కుటుంబాలను అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇతర వర్గాల వారికి బకాయిలు వేసినప్పుడు ముస్లిం మైనార్టీలకు వేయకపోవడానికి గల కారణం ఏమిటో తెలియని అయోమయంలో విద్యార్థులు ఉన్నారని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా, ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా గారి దృష్టికి తీసుకొని వెళ్ళినా ఉపయోగం జరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతున్నారని కానీ ముస్లిం విద్యార్థులకు న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు. పేరుకి మైనార్టీ అనుకూల ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తున్న జగన్ కు ముస్లింలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ముస్లిం మైనారిటీలకు, బిసి విద్యార్థులకు విదేశీ విద్య నిధులను మంజూరు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, ముస్లిం మైనార్టీ సంఘాలు, బీసీ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని బాజీ పేర్కొన్నారు. ఇప్పటికైనా మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేసి ఆదుకొకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తమ పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విదేశీ విద్యకు చెందిన గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు

Latest News