సబ్సిడీ పై వేరు శనగ విత్తనాలు

విధాత‌(విజయవాడ) రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీపై వేరుశనగ విత్తనాల పంపిణీ చేయ‌నున్న‌ట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అవ‌స‌రం ఉన్న రైతులు ఈ నెల 10 వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చ‌ని సూచించారు. ఈ నెల 17 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామ‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌ను జూన్ 17 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల నుంచే విత్తనాలు సేక‌రించి నాణ్య‌మైన విత్త‌నాలు […]

  • Publish Date - May 8, 2021 / 12:49 PM IST

విధాత‌(విజయవాడ) రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీపై వేరుశనగ విత్తనాల పంపిణీ చేయ‌నున్న‌ట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అవ‌స‌రం ఉన్న రైతులు ఈ నెల 10 వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చ‌ని సూచించారు. ఈ నెల 17 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామ‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌ను జూన్ 17 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

రైతుల నుంచే విత్తనాలు సేక‌రించి నాణ్య‌మైన విత్త‌నాలు స‌బ్సిడీపై అంద‌జేస్తామ‌న్నారు. సుమారు 4 లక్షల 50 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. 40 శాతం రాయితీ తో విత్తనాలు ఇస్తామ‌న్నారు. సమీక్ష లో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనమ్ మాల కొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబు పాల్గొన్నారు.

Latest News