PM Modi Kurnool Public Meeting | ప్రధాని మోదీ సభ వద్ద అపశృతి
కర్నూలు శివారులోని నన్నూరులో ప్రధాని మోదీ బహిరంగ సభ వద్ద కరెంట్ షాక్‌తో మునగాలపాడుకు చెందిన అర్జున్ మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సభ ప్రారంభమైంది. వేదికపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.

అమరావతి : కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభా ప్రాంగణం వద్ద కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు కర్నూలు జిల్లా మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు సభా వేదిక పైకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు జాతీయ జెండాలు ఊపి స్వాగతం పలికారు. సభా వేదిక మీద గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కర్నూలు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు.