మూడు విభాగాల్లో ఎపిఎండిసికి ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికేట్లు
సర్టిఫికేట్లను అందచేసిన ఐఎస్‌ఓ ఏజెన్సింగ్ చీఫ్ ఆడిటర్ (చెన్నై) మురళి క్వాలిటీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌లో అంతర్జాతీయ గుర్తింపు హెల్త్ అండ్ సేఫ్టీలో అత్యున్నత ప్రమాణాలు పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ విధానాల అమలు అంతర్జాతీయ మార్కెట్లలో ఎపిఎండిసికి మరింత పెరిగిన ప్రతిష్ట ఖనిజ విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ గీటురాయి అమరావతి,విధాత:ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధిసంస్థ (ఎపిఎండిసి) అంతర్జాతీయంగా మూడు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సాధించింది. ఈ మేరకు ఐఎస్‌ఓ ఏజెన్సింగ్ సంస్థ చీఫ్ ఆడిటర్ (చెన్నై) మురళి […]

- సర్టిఫికేట్లను అందచేసిన ఐఎస్‌ఓ ఏజెన్సింగ్ చీఫ్ ఆడిటర్ (చెన్నై) మురళి
- క్వాలిటీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌లో అంతర్జాతీయ గుర్తింపు
- హెల్త్ అండ్ సేఫ్టీలో అత్యున్నత ప్రమాణాలు
- పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ విధానాల అమలు
- అంతర్జాతీయ మార్కెట్లలో ఎపిఎండిసికి మరింత పెరిగిన ప్రతిష్ట
- ఖనిజ విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ గీటురాయి
అమరావతి,విధాత:ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధిసంస్థ (ఎపిఎండిసి) అంతర్జాతీయంగా మూడు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సాధించింది. ఈ మేరకు ఐఎస్‌ఓ ఏజెన్సింగ్ సంస్థ చీఫ్ ఆడిటర్ (చెన్నై) మురళి విజయవాడలోని ఎపిఎండిసి కార్యాలయంలో బుధవారం సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి సర్టిఫికేట్లను అందచేశారు. ఈ సందర్భంగా విజి వెంకటరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఎపిఎండిసి నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. ఇప్పుడు ఐఎస్‌ఓ నుంచి మొత్తం మూడు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను అందిస్తున్న సంస్థగా గుర్తింపు రావడం ఎపిఎండిసి ప్రతిష్టను మరింత పెంచిందని అన్నారు. ఎపిఎండిసి ఆధ్వర్యంలోని మైన్స్ ద్వారా వెలికితీస్తున్న అత్యంత నాణ్యతతో కూడిన బైరటీస్‌ను, గ్రానైట్ ఖనిజాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో మన ఖనిజ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, దానికి సంస్థ అనుసరిస్తున్న నాణ్యతా ప్రమాణాలే కారణమని అన్నారు. తాజాగా క్వాలిటీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్, హెల్త్ అండ్ సేఫ్టీ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో సంస్థ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించిన మీదట అంతర్జాతీయ సంస్థ ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వరంగంలో ఉన్న ఎపి ఖనిజాభివృద్ధి సంస్థ వినియోగదారుల విశ్వసనీయతను చూరగొనేలా, ప్రమాణాలతో కూడిన విధానాల అమలులో ప్రస్తుతం లభించిన ఐఎస్‌ఓ సర్టిఫికేట్లు ఒక గీటురాయిలా నిలుస్తున్నాయని అన్నారు. కేవలం మైనింగ్ వ్యాపార కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రకృతి సమతూల్యతను కాపాడేందుకు ఎపిఎండిసి కృషి చేస్తోందని అన్నారు. అలాగే మైనింగ్ ప్రాంతాల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణకు, వారి ఆరోగ్యభద్రత, అత్యవసర వైద్యంకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడంలో ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. మరో వైపు ఎపిఎండిసి గనుల ద్వారా వెలికితీస్తున్న ఖనిజాల నాణ్యతలో అంతర్జాతీయ ప్రమాణాలను మొదటి నుంచి అనుసరిస్తోందని తెలిపారు. సంస్థకు చెందిన క్వాలిటీ చెక్ ల్యాబ్‌లతో పాటు థర్డ్‌పార్టీ ల్యాబ్‌లలో కూడా ఖనిజ నాణ్యతను పరీక్షించిన తరువాతే వినియోగదారులకు విక్రయిస్తోందని వెల్లడించారు. ఇటువంటి విధానాల వల్లే ఎపిఎండిసి ఖనిజ ఉత్పత్తులకు ప్రపంచదేశాల్లో డిమాండ్‌ను మరింత పెంచాయని అన్నారు. ఇదే ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకంలో ప్రభుత్వరంగ ఖనిజాభివృద్ధి సంస్థగా ఎపిఎండిసి మరిన్ని మైలురాళ్ళను అధిగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉన్నత ప్రమాణాల సాధనలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న సంస్థ అధికారులు, ఉద్యోగులు, కార్మికులను ఈ సందర్భంగా అభినందించారు. ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను స్వీకరించే కార్యక్రమంలో ఎపిఎండిసి సీనియర్ అధికారులు కేదార్‌నాథ్‌రెడ్డి, ఎస్‌విసి బోస్, నతానియేలు, లీలా, లక్ష్మణ్‌రావు, సత్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు.