ప్రయాణికులకు అలెర్ట్..! విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు ఇవే..!

దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి పలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్నింటిని పాక్షికంగా.. కొన్నింటి దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ డివిజన్‌లో రైల్వేలైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం మండ్రుపకర్ పేర్కొన్నారు.
అక్టోబర్ 30 నుంచి నంబర్ ఐదు వరకు విజయవాడ-బిట్రగుంట వచ్చేపోయే రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 30 నుంచి నవంబర్ 3 వరకు బిట్రగుంట-చెన్నై, ఈ నెల 30, 31, నవంబర్ 1, 3, 4 తేదీల్లో విజయవాడ-విశాఖపట్నం అప్‌డౌన్ రైల్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 30 నుంచి నవంబర్ వరకు మచిలిపట్నం -విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, నర్సాపూర్-విజయవాడ, విజయవాడ – నర్సాపూర్, రామవరప్పాడు – విజయవాడ మధ్య రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు.
30న ఎర్నాకుళం జంక్షన్ – పాట్నా రైలును, నవంబర్ 4న భావ్‌నగర్-కాకినాడ పోర్ట్ రైలు, నవంబర్ ఒకటి, 3 తేదీల్లో బెంగళూరు – గౌహతి రైలు, అక్టోబర్ 30, నవంబర్ 1, 3, 4 తేదీల్లో ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్-భువనేశ్వర్ రైళ్లను విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించనున్నట్లు పీఆర్వో వివరించారు.